Himachal Bus Landslide: ఒక ప్రైవేట్ బస్సుపై కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతి చెందిన ఘటన మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్‌పూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని బార్తీ సమీపంలోని భలు వద్ద ఒక ప్రైవేట్ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయని పేర్కొన్నారు.
READ ALSO: shutdown: రియాలిటీ షో అభిమానులకు షాక్ .. బిగ్ బాస్ చిత్రీకరణ నిలిపివేయాలంటూ…
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు పైకప్పుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. సమచారాం అందుకున్న వెంటనే రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంలో ఒక చిన్నారిని సజీవంగా రక్షించినట్లు పలు కథనలు వస్తున్నాయి. ఇప్పటికీ సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సు మరోటన్ నుంచి ఘుమార్విన్‌కు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో భల్లు వంతెన పరిధిలోని ఒక కొండ మొత్తం కూలిపోయి బస్సుపై పడింది. ప్రమాదం సాయంత్రం 6:25 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది.
సంఘటనా స్థలంలో గందరగోళం..
ఈ ప్రమాదం తర్వాత సంఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చి గుమిగూడారు. ఇప్పటికే సహాయ చర్యల కోసం జెసిబి యంత్రాలు శిథిలాలను తొలగించాయి. అంబులెన్స్‌లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రమాదంలో ఎంత మంది వరకు మరణించారనేది సరిగ్గా తెలియలేదు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇప్పటి వరకు 15 మంది మరణించారని తెలుస్తుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్‌విందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని, వారి చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం సిమ్లా నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
READ ALSO: 11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన 11 దేశాలు!
