జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలింది. ఈ ప్రమాదంలో భారత సైన్యంలోని జాట్ రెజిమెంట్‌కు చెందిన ఒక సైనికుడు (అగ్నివీర్) మరణించగా, ఒక జెసిఓ, ఒక సైనికుడు గాయపడ్డారు. గాయపడిన సైనికులను హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రికి తరలించారు. హవేలి తహసీల్‌లోని సలోత్రి గ్రామంలోని విక్టర్ పోస్ట్ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ల్యాండ్‌మైన్‌లను ఈ ప్రాంతంలో చొరబాట్లను నిరోధించడానికి అమర్చారు. భారత సైన్యంలోని 07 జాట్ రెజిమెంట్ సైనికులు సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పేలినట్లు తెలుస్తోంది.
Landmine Blast: జమ్మూ కాశ్మీర్‌లో పేలిన ల్యాండ్‌మైన్.. ఆర్మీ జవాను మృతి
- జమ్మూ కాశ్మీర్‌లో పేలిన ల్యాండ్‌మైన్
- ఆర్మీ జవాను మృతి

Army