సాదారణంగా సినిమాలో ఒక హీరోయిన్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అదే ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో కనిపిస్తే ఇక ఫ్యాన్స్ కు పండగ.. ఆ సినిమాకి ఏ రేంజ్ హైబ్స్ ఉంటాయో మనందరం అర్థం చేసుకోవచ్చు.. ఒక హీరో కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ కాంబోలో వచ్చిన సినిమాలు మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. ఇక ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో కనిపిస్తే ఇక రచ్చ మాములుగా ఉండదు..
లేడీ ఓరియంటెడ్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు తలకి కట్టినట్లు కనిపిస్తే ప్రేక్షకులు ఎంతగానో కృషి అవుతారు. ఇక తాజాగా ఇటువంటిదే ఓ సినిమా రాబోతుంది.. మరి ఆ సినిమాలో ఎవరు హీరోయిన్లు అనే సంగతి ఆసక్తి గా అనిపిస్తుంది కదా.. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు? ఏ డైరెక్టర్ తో చేస్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన అనుపమ పరమేశ్వరన్ ఓ లేడి ఓరియేంటెడ్ మూవీకి సైన్ చేసిందని టాక్.. అలాగే స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ సినిమాలో నటిస్తుందని టాక్.. ఈ మూవీకి ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు.. గతంలో అఆ మూవీ చేశారు.. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.. త్వరలోనే ఈ సినిమా గురించి త్వరలోనే ప్రకటన రాబోతుందని సమాచారం..