Site icon NTV Telugu

Varshini- Lady Aghori: అందుకే అఘోరీని పెళ్లి చేసుకున్న.. శ్రీ వర్షిణి సంచలన వ్యాఖ్యలు..

Srivarni

Srivarni

Varshini- Lady Aghori: తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం గతంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరీ మరో సంచలనానికి తెరలేపింది. అయితే.. తాజాగా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్. ఇదిలా ఉండగా.. అప్పట్లో ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ, వర్షిణి పెళ్లి చేసుకున్నారు. వర్షిణి మెడలో అఘోరి తాళికట్టగా.. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి.

READ MORE: PoK: పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పీఓకేలో నిరసనలు.. పాక్ ఆర్మీ కాల్పులు..

అయితే.. ఈ పెళ్లి అంశంపై తాజాగా శ్రీ వర్షిణి ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. మొదట తాను పెళ్లి టాపిక్ ఎత్తలేదని చెప్పింది. శ్రీనివాస్ తనని ఫోర్స్ చేసినట్లు వెల్లడించింది. ” పెళ్లి చేసుకుందాం.. మీ తల్లిదండ్రులను సైతం తెచ్చుకుని చూసుకుందాం.. నీకు ఓ మంచి జీవితం ఉంటుంది. ఇప్పుడు ఎలాగో నువ్వు నాతో వచ్చేశావ్.. బయటకు వెళితే తలెత్తుకోలేవు.. ఇక ఆత్మహత్య చేసుకోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు అని చెబుతూ.. ఫోర్స్ చేసి ఒప్పించాడు. పెళ్లి విషయంలో నాకు కొంచెం ఇష్టం ఉంది.. కొంచెం బలవంతం ఉంది. పెళ్లి చేసుకున్నాక.. భార్యగా ఉండాలనే చెప్పాడు. నన్ను అఘోరీగా మారుస్తానని చెప్పలేదు.” అని శ్రీ వర్షిణి వెల్లడించింది.

READ MORE: BC Reservations : బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

Exit mobile version