NTV Telugu Site icon

Krithi Shetty : అలాంటి పాత్రలను చేయాలని వుంది..

Krithi Shetty (1)

Krithi Shetty (1)

Krithi Shetty : టాలీవుడ్ డైనమిక్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మనమే’ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్,టీజర్ ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.

Read Also :Gangs Of Godavari : విశ్వక్ సేన్ మూవీ చూసిన బాలయ్య..అదిరిపోయిందంటూ ప్రశంసలు..

ఈ సినిమాలో తాను సుభద్ర అనే పాత్ర చేస్తున్నట్లు ఆమె తెలిపింది.ఇప్పటివరకు నేను క్యూట్ అండ్ బబ్లీ రోల్స్ చేశాను.అయితే ఈ సినిమాలో నేను చాల స్ట్రిక్ట్ రోల్ చేశాను.ఈ సినిమాలో శర్వానంద్ గారు ఎంతో అద్భుతంగా నటించారు.ప్రతి సీన్ కూడా ఆయన ఎంతో చక్కగా చేసారు.ఈ సినిమాలో శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం.అయితే ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది.అయితే భవిష్యత్ ఎలాంటి రోల్స్ చేయాలని వుంది అని ప్రశ్నించగా.ప్రిన్సెస్ లా నటించాలని ఉందని కృతి తెలిపింది.అలాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కూడా చేయాలనీ ఉందని కృతి శెట్టి తెలిపింది.

Show comments