ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా బ్యూటీ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి.. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ తో మరో హిట్ అందుకుంది. మొదటి లో పద్దతిగా నటించిన కృతి శెట్టి ఆ తర్వాత శంసింగరాయ్ లో గ్లామర్ షోతో ఆకట్టుకుంది. అలాగే లీక్ లాక్ సీన్ లో రెచ్చిపోయి నటించింది.. ఆ తర్వాత నాగ చైతన్య కు జోడిగా బంగార్రాజు సినిమాలో నటించింది అది కూడా విజయాన్ని అందుకుంది..
అంతవరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని కూడా యావరేజ్ టాక్ ను అందుకున్నాయి.. వరుసగా ఫ్లాప్స్ పలకరించాయి. చేసిన లనే డిజాస్టర్స్ గా నిలిచాయి. యంగ్ హీరోలందరి సరసన నటించింది కృతిశెట్టి.. కానీ ఈ సినిమాలన్నీ అమ్మడిని నిరాశపరిచాయి. చివరిగా చేసిన కస్టడీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ మధ్య తమిళ్ స్టార్ హీరో సూర్య లో ఛాన్స్ అందుకుంది.. కానీ ఆ పట్టాలెక్కలేదు. దాంతో ఈ చిన్నదాని బ్యాడ్ లాక్ అనుకున్నారు అంతా…
కానీ ఇప్పుడు బంఫర్ ఆఫర్ కొట్టేసింది.. తమిళ్ లో జీనీ అనే సినిమా రానుంది. ఈ మూవీలో జయం రవి హీరోగా నటిస్తున్నాడు. కృతి శెట్టితో పాటు కల్యాణి ప్రియదర్శన్, వామిక కబీ కూడా నటిస్తున్నారు. దాదాపు 100కోట్ల భారీ బడ్జెట్ తో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరీ గణేష్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే కృతిశెట్టి అదృష్టం మారినట్టే.. మళ్లీ ట్రాక్ లోకి వస్తుంది.. చూడాలి మరి ఎలా ప్రేక్షకులను అలరిస్తుందో..