Site icon NTV Telugu

Koti Deepotsavam 2024 Day 8 LIVE : శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం

Koti Deepotsavam Day 8

Koti Deepotsavam Day 8

భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్‌ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు.

 

భక్తి టీవీ కోటి దీపోత్సవం 8వ రోజు విశేషాలు
భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోటి దీపోత్సవం 8వ రోజు ప్రత్యేకమైన పూజలు జరగనున్నాయి. ఈరోజు కాజీపేట శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామికి సప్త వర్ణ మహాభిషేకం, కోటి గరికార్చన ప్రత్యేకంగా నిర్వహించబడతాయి.

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం:
ఆపరిమిత అనుగ్రహాలను ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పవిత్ర కల్యాణోత్సవం (దివ్యవివాహం) ఘనంగా జరగనుంది. స్వామి వారి ముషిక వాహనంపై సిద్ధి, బుద్ధి సహితంగా భక్తులకు అనుగ్రహం చేస్తారు.

ఆధ్యాత్మిక ప్రసంగాలు:
ఈ సందర్భంగా కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామి వారి అనుగ్రహ భాషణం ఉంటుంది. అలాగే, బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఆధ్యాత్మిక ఉపన్యాసం అందిస్తారు.

కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. కార్తిక మాసం శుభవేళ కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచన టెలివిజన్‌ ప్రైవెట్‌ లిమిటెడ్‌.. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రి కూడా భక్తి టీవీ ఉచితంగా అందజేస్తోన్న విషయం విధితమే కాగా.. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోందని మీకు తెలియజేస్తున్నాం.

Exit mobile version