కార్తీక మాస శోభతో, అశేష భక్తజన సందోహం మధ్య భక్తి టీవీ నిర్వహిస్తున్న మహా ఆధ్యాత్మిక వేడుక ‘కోటి దీపోత్సవం – 2026’ రెండవ రోజు కార్యక్రమాలు అత్యంత వైభవంగా ముగిశాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మహోత్సవంలో భాగంగా రెండవ రోజైన కార్తీక ఆదివారం – స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేందుకు నిర్వహించిన విశేష కార్యక్రమాలు అద్భుతంగా సాగాయి.
పీఠాధిపతుల అనుగ్రహ భాషణం.. ప్రవచనామృతం
రెండవ రోజు వేడుకల్లో భాగంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ, రాజస్థాన్‌లోని హరి కృపా ధామ్ మహారాజ్ శ్రీ హరిచైతన్యపురి మహరాజ్ భక్తులకు తమ దివ్య అనుగ్రహ భాషణాన్ని అందించారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ తాడేపల్లి పతంజలి శాస్త్రి గారి ప్రవచనామృతం భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచింది.
విశేష పూజలు , దివ్య కల్యాణోత్సవం
వేదికపై అత్యంత భక్తిశ్రద్ధలతో ‘వేలాయుధ కావడి పూజ’, ‘శ్రీ గురురాఘవేంద్ర ఆరాధన’ నిర్వహించారు. అలాగే ప్రాంగణానికి విచ్చేసిన భక్తులందరూ స్వయంగా పాల్గొనేలా శివపుత్రునికి ‘కోటి పుష్పార్చన’ కార్యక్రమం కనులపండువగా జరిగింది. నేటి ప్రధాన ఘట్టంగా తిరుచెందూరు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ దివ్య ఘట్టం అనంతరం సప్తహారతులు, స్వర్ణలింగోద్భవం కనులవిందుగా సాగాయి. రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. సురేందర్ సతీసమేతంగా విచ్చేశారు.
వాహన సేవ
కల్యాణోత్సవానంతరం స్వామివారికి అత్యంత విశిష్టమైన ‘పల్లకీ’ వాహన సేవను నిర్వహించారు. తొలి రోజు శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణంలో, నేడు స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణతో కోటి దీపోత్సవ వేదిక పులకించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ దివ్య వేడుకల్లో పాల్గొని తరించారు.
కోటి దీపోత్సవం 2వ రోజు ఉత్సవంలో భాగంగా వేదికపై సుబ్రహ్మణ్య వేలాయుధ కావడి పూజ..
#NoriNarayanaMurthy #BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/VPFjWxIm9X
— BhakthiTV (@BhakthiTVorg) November 15, 2026
కోటిదీపోత్సవం-2026 2వ రోజు ఉత్సవంలో భాగంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/E0tI9IgVvN
— BhakthiTV (@BhakthiTVorg) November 15, 2026
కోటిదీపోత్సవం-2026 2వ రోజు ఉత్సవంలో భాగంగా పల్లకీపై తిరుచెందూరు ఉత్సవమూర్తుల ఊరేగింపు.
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/689AnLUyEB
— BhakthiTV (@BhakthiTVorg) November 15, 2026
మంత్రాలయం మఠాధిపతి దివ్య సాన్నిధ్యంలో.. శ్రీ గురురాఘవేంద్ర స్వామి వారి విశేష ఆరాధన!
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 https://t.co/VK2H8Tu0uM
— BhakthiTV (@BhakthiTVorg) November 15, 2026

