హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 పదో రోజు వేడుకలు సోమవారం, నవంబర్ 23న కార్తీక రెండో సోమవారం, వైకుంఠ చతుర్దశి పర్వదినం సందర్భంగా కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో శ్రీ సంపూర్ణానందగిరి స్వామీజీ, శ్రీశ్రీశ్రీ శివ స్వామీజీ అనుగ్రహ భాషణం, డాక్టర్ గరికిపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనం, వేదికపై నవధాన్య లింగార్చన, ఉజ్జయిని మహాకాళి భస్మ హారతి, భక్తుల చేతుల మీదుగా శివలింగాలకు నవధాన్యాల అర్చన, కంచి శ్రీ ఏకామ్రేశ్వరస్వామి కల్యాణోత్సవం, పల్లకి సేవ వంటి విశేష కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ భక్తులకు ఉచితంగా పూజా సామాగ్రిని అందిస్తూ పూజలు, దీపారాధన చేసుకునే అవకాశం కల్పిస్తుండగా, ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని కింది లింక్‌లో వీక్షించవచ్చు.

