Site icon NTV Telugu

Koti Deepotsavam 2025: సిద్దమా.. రేపటి నుంచే హైదరాబాద్‌లో ‘కోటిదీపోత్సవం’!

Koti Deepotsavam 2025

Koti Deepotsavam 2025

కార్తికమాసం రాగానే శివ భక్తులందరికీ గుర్తుకువచ్చే దివ్యమైన కార్యక్రమం ‘కోటిదీపోత్సవం’. భక్తి, ధర్మం, సేవ.. లాంటి విలువలను ముందు తరాలకు అందించేందుకు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు చేస్తున్న మహా యజ్ఞమే ఈ కోటి దీపోత్సవం. భక్తి టీవీ ఆధ్వర్యంలో 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపాల పండగ.. 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతోంది. కార్తిక మాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభమే కోటి దీపోత్సవం. ప్రతి ఏటా జరిగే ఈ దీపయజ్ఞం.. రేపటి నుంచి ఆరంభం కానుంది.

Also Read: India Women: చరిత్రలో నిలిచేపోయే విజయం.. భారత్ ప్రపంచ రికార్డులు ఇవే!

కోటిదీపోత్సవం 2025 నవంబర్ 1 ఆరంభం కానుంది. ఈ దీపాల పండుగ నవంబర్ 13 వరకు కొనసాగనుంది. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవం కార్యక్రమం జరగనుంది. ప్రతి రోజు సాయంత్రం 5.30కు దీపాల పండగ ఆరంభం కానుంది. ఎన్టీఆర్‌ స్టేడియం ఇప్పటికే కైలాసాన్ని తలపిస్తోంది. రాత్రి వెలుగుల్లో అయితే కన్నుల పండగగా వెలిగిపోతోంది. కోటిదీపోత్సవంలో పాల్గొనడానికి భక్తులు ఇప్పటికే సిద్దమయ్యారు. భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు.. ప్రతీది ఉచితంగా ఇవ్వబడతాయి.

Exit mobile version