NTV Telugu Site icon

Koti Deepotsavam 2023 8th Day: కోటి దీపోత్సవంలో 8వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam 2023 8th Day: ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన దీపయజ్ఞం కోటిదీపోత్సవం ఎనిమిదో రోజుకు చేరింది.. ‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే..” అంటారు.. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగిచ గలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది.. అదే ఒకే చోట కోటి దీపాలను వెలిగించి.. ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ.. లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహా యజ్ఞం కోటికి చేరుకుని.. తెలుగు రాష్ట్రాలలోని భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది..

ఇక, 8వ రోజుకు చేరిన కోటిదీపోత్సవం వేడుకలు నేటి కార్యక్రాల విషయానికి వస్తే..

* నాగసాధువులచే మహా రుద్రాభిషేకం

* సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన

* ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కల్యాణం

* సింహవాహనంపై ఆదిపరాశక్తి అద్భుత సాక్షాత్కారం

* కంచి కామాక్షి దేవి, కొల్హాపూర్‌ మహాలక్ష్మి దర్శన భాగ్యం

* మైసూర్‌ అవధూత దత్తపీఠం శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీర్వచనం

* ఉడుపి పెజావర్‌ మఠం శ్రీవిశ్వప్రసన్న తీర్థస్వామి ఆశీర్వచనం

* పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం

* అద్భుత కళాసంబరాలు, అద్వితీయ భక్తినీరాజనాలు

ఇలా ఎన్నో అద్భుత ఘట్టాలకు వేదికకానుంది భక్తి టీవీ కోటిదీపోత్సవ వేదిక.. ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఉచితంగా అందజేస్తోంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న కోటిదీపోత్సవంలో పాల్గొని.. ఆ ఆదివేడి కృపకు పాత్రులు కావాలని ఆహ్వానం పలుకుతున్నాం..

Show comments