NTV Telugu Site icon

Koratala Shiva : ఎన్టీఆర్ లేకుండానే ‘దేవర’ షూటింగ్.. గ్యాప్ లో ఆ పని చేస్తున్న కొరటాల..?

Whatsapp Image 2024 05 06 At 11.02.06 Am

Whatsapp Image 2024 05 06 At 11.02.06 Am

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు .అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5 నా విడుదల చేయాలనీ భావించిన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది .ఈ సినిమాను అక్టోబర్ 10 న దసరా కానుకగా విడుదల చేయనున్నారు .ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమాతో పాటు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు

తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ అటు దేవర ఇటు వార్ 2 షూటింగ్ లతో బిజీ గా గడుపుతున్నారు.అలాగే దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటంతో ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్ నిర్వహిస్తున్నాడు.సినిమాలో ఎన్టీఆర్ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు.అలాగే దర్శకుడు కొరటాల యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న “కృష్ణమ్మ ” సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.దేవర షూటింగ్ నిర్వహిస్తూనే గ్యాప్ లో కృష్ణమ్మ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చూసుకుంటున్నారు.త్వరలోనే దేవర షూటింగ్ ను కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నారు .

Show comments