ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. గురువారం తొలిరోజే హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. ఆసీస్ బ్యాటర్లతో పాటు టీమిండియా బ్యాటర్లు కూడా ఇబ్బందిపడుతున్న పిచ్‌పై అలవోకగా బ్యాటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఆటతీరుకు ముగ్ధుడైన ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ వా అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ చాలా త్వరగా ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను దూరం చేస్తాడని కితాబిచ్చాడు. ఇదే సమయంలో కోహ్లీతో రోహిత్‌ను పోలుస్తూ పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు.
Also Read: Kantara: వరాహరూపం కాంట్రవర్సీ… సుప్రీమ్ కోర్టులో మేకర్స్ కి ఊరట
“భారత బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ ఎంతో కీలకమైన ఆటగాడు. స్పిన్‌లో అతడు చాలా బాగా ఆడుతున్నాడు. చాలా త్వరగా పరుగులు తీస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రోహిత్‌ను కాకుండా మిగిలిన భారత బ్యాటర్లను గమనిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. విరాట్ కోహ్లీనే తీసుకోండి. అతడు బ్యాటింగ్ చేసేటప్పుడు కాస్త సమయం తీసుకుంటాడు. తన సమయం వచ్చిందాక ఎదురుచూస్తాడు. కానీ రోహిత్ అలా కాదు. ఆస్ట్రేలియా నుంచి చాలా త్వరగా మ్యాచ్‌ను దూరం చేస్తాడు. గురువారం నాడు అతడు వేరే పిచ్‌పై బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడిలా కనిపించాడు” అని మార్క్‌వా చెప్పాడు.
Also Read: INDvsAUS 1st Test: రోహిత్ సూపర్ సెంచరీ..లీడ్‌లోకి టీమిండియా
