రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. 4 కోట్ల విలువైన తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈరోజు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు కోదండరెడ్డి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరఫున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్ పాల్గొన్నారు. కోదండరెడ్డి మంచి మనసుకు రాష్ట్రం మొత్తం ఫిదా అవుతోంది. కోట్ల విలువు చేసే భూమిని ప్రభుత్వానికి అప్పగించడంపై ప్రజలు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: AUS vs IND: చెలరేగిన బౌలర్లు.. నాలుగో టీ20లో భారత్ భారీ విజయం!
రెండు నెలల క్రితమే తన సొంత గ్రామం ఐనా యాచారం గ్రామంలోని 4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో వున్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు కోదండరెడ్డి ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిమొట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి చెప్పారు. దానికి సంబందించి అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు ముగిసింది.
