NTV Telugu Site icon

Kodali Nani: చంద్రబాబుకు కొడాలి నాని బహిరంగ సవాల్..

Kodali Nani

Kodali Nani

Kodali Nani : గుడివాడ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు.. చంద్రబాబు మగాడు అయితే గుడివాడ నుండి పోటీ చేసి గెలవాలని చాలెంజ్ చేశారు.. గుడివాడ ఎమ్మెల్యేగా ఇళ్ళ పట్టాల సమస్యను పరిష్కరించమని అన్నట్లో సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అడిగాను.. అప్పుడు నేను టీడీపీ ఎమ్మెల్యే అయినా వైఎస్సార్ సానుకూలంగా స్పందించారని గుర్తుచేసుకున్నారు.. 45 రోజుల్లో 75 ఎకరాలను భూసేకరణ చేసి ఇచ్చారు.. ఈ భూమి రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన భిక్షగా పేర్కొన్న ఆయన.. అందుకే ఇక్కడ 18 అడుగుల రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.. 800 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఖర్చు చేసింది రూ.180 కోట్లు మాత్రమే.. లబ్ధిదారుల నుంచి సైతం డబ్బులు వసూలు చేశాడని మండిపడ్డారు.. ఇక, ఇవాళ సిగ్గు లేకుండా టిడ్కో ఇళ్ళు నేనే కట్టాను అంటున్నాడు అని ఫైర్‌ అయ్యారు.

పాదయాత్ర సమయంలో ఇక్కడే వైఎస్‌ జగన్ విడిది చేశారు.. అప్పుడే 300 చదరపు అడుగుల ఇంటిని ఒక్క రూపాయికే ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు కొడాలి నాని.. నేను లెగిస్తే ఎవరూ పడుకోరు అని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు.. వాజ్‌పేయ్‌, మోడీ సంక నాకే చంద్రబాబు గుడివాడకు ఏమీ చేయలేదు అని మండిపడ్డారు.. రైలు గేట్ల దగ్గర ఫ్లై ఓవర్ కావాలని విజ్ఞప్తి చేశాను.. సీఎం జగన్‌ కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారని తెలిపారు. ఇక, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుడివాడలో వాటర్ పంప్ హౌస్ కట్టారు.. గుడివాడ ప్రజల దాహార్తిని తీర్చిన మహానుభావుడు వైఎస్ అని పేర్కొన్నారు. 30 లక్షల మంది పేదలకు లక్షా ఎకరాలు భూసేకరణ చేసి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్‌ అని ప్రశంసలు కురిపించారు.

ఇదే సమయంలో.. చంద్రబాబు మగాడు అయితే గుడివాడ నుండి పోటీ చేయలని సవాల్‌ విసిరారు కొడాలి నాని.. గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్ కలిసి గుడివాడలో పేదలకు ఇళ్ళు, మంచినీటి సదుపాయం కోసం 650 ఎకరాలు కేటాయించారని తెలిపారు.. ఇక, ఈ రాష్ట్రానికి జగనే శాశ్వత ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ ను దించే మగాడు ఈ రాష్ట్రంలో పుట్టలేదని.. మరోవైపు.. గుడివాడకు నేనే ఎమ్మెల్యేను అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కొడాలి నాని.