వంటగది అనేది ఇంటికి గుండెకాయ వంటిది. అక్కడ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి రుచిని తగ్గించడమే కాకుండా, పనిని మరింత క్లిష్టతరం చేస్తాయి. అందుకే, గృహిణులకు, వంట చేసే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా కొన్ని అద్భుతమైన “కిచెన్ టిప్స్” ఇక్కడ ఉన్నాయి. ఇవి మీ వంటను రుచిగా మార్చడమే కాకుండా మీ సమయాన్ని కూడా పొదుపు చేస్తాయి.
1. తక్కువ నూనెతో రుచికరమైన గారెలు
వడలు, గారెలు లేదా బూరెలు వంటివి వండేటప్పుడు అవి నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయని చాలామంది భయపడతారు. కానీ మీరు గారెలు, కానీ ఇతర వంటకాలు వేయించే ముందు నూనెలో కొద్దిగా ఉప్పు కలిపితే, అవి తక్కువ నూనెను పీల్చుకుంటాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు రుచి కూడా పెరుగుతుంది.
2. కాకరకాయ చేదును పోగొట్టే మార్గం
చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కానీ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. కనుక కాకరకాయ ముక్కలకు కొద్దిగా ఉప్పు రాసి, నీళ్లు చల్లి ఒక గంట సేపు పక్కన పెడితే అందులోని చేదు అంతా పోతుంది. ఆ తర్వాత వాటిని వండుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.
3. పుదీనా ఆకులతో ఈగలు, దోమలకు చెక్!
డైనింగ్ టేబుల్ నిట్ గా ఉంచడాని నానా తిప్పలు పడుతుంటారు. ముఖ్యంగా ఈగలు లేదా దోమలు రావడం అందరికీ ఇబ్బంది కలిగించే విషయం.కాబటి డైనింగ్ టేబుల్ మధ్యలో కొన్ని తాజా పుదీనా ఆకులను ఉంచండి. పుదీనా ఆకుల నుంచి వచ్చే ఘాటైన వాసన కారణంగా ఈగలు.. దోమలు ఆ దరిదాపుల్లోకి రావు.
4. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే..
మనం ఇంట్లో తయారు చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కోసారి త్వరగా పాడైపోతుంది. ఫ్రిజ్ లో పెట్టిన కూడా లైట్ గా ఫంగస్‌లా వస్తుంది. అలాంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసిన తర్వాత, అందులో ఒక చెంచా ఆవాల నూనె కలిపి నిల్వ చేయండి. ఇలా చేయడం వల్ల అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది.
5. అంటుకోకుండా ఆమ్లెట్ వేయడం ఎలా?
కొన్నిసార్లు దోశ పెనం మీద ఆమ్లెట్ వేసినప్పుడు అది సరిగ్గా రాకుండా అంటుకుపోతుంది. ఆమ్లెట్ వేసే ముందు పెనం మీద కొద్దిగా ఉప్పు చల్లి, ఆ తర్వాత ఆమ్లెట్ వేయండి. ఇలా చేస్తే ఆమ్లెట్ పెనానికి అంటుకోకుండా చాలా చక్కగా వస్తుంది.
6. స్వీట్ కార్న్ మరింత రుచిగా ఉండాలంటే..
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్ మరింత రుచిగా ఉండటానికి ఈ చిట్కా పాటించండి. స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు అందులో అర చెంచా పంచదార వేయండి. దీనివల్ల స్వీట్ కార్న్ మరింత తియ్యగా రుచిగా మారుతుంది. త్వరగా ఉడుకుతుంది కూడా.
ముగింపు: చూశారుగా! ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వంట చేయడం ఎంతో సులభమవుతుంది. మీ వంటగదిలో ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి.
