NTV Telugu Site icon

Kishan Reddy: బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం

Bjp

Bjp

బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో వాళ్ళ అభిప్రాయాలను బీజేపీ శ్రేణులు తీసుకున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించారు.. సంతోషం అని మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు అన్నారు. మాకు ఏ పని అప్పగించిన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అయితే, ఎమ్మెల్సీ కవిత విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో చర్చ జరుగుతుంది.. అభ్యర్థులను ముందే ప్రకటిస్తే బాగుంటుంది అని బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు చెప్పారు.

Read Also: Alia Bhatt Pics: శారీలో అలియా భట్ సొగసులు.. ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ హాట్ పిక్స్ వైరల్!

బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు చెప్పిన దానికి సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ.. ఇకపై మేము అందుబాటులో ఉంటామని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే వారు నియోజక వర్గాల్లో పనిచేసుకొండి.. ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. మీరు ఏది చెప్పాలని అనుకున్న మాకు చెప్పండి.. లేదా కిషన్ రెడ్డి అందుబాటులో లేని సమయంలో ఇంద్రా సేనా రెడ్డిని కలువొచ్చు అని ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ తెలిపారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకునేలా బీజేపీ శ్రేణులు వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో అనుసరించాల్సిన 100 రోజుల కార్యచరణపై కమలం పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు.

Read Also: Dimple Hayathi : మత్తెక్కించే చూపులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..