Site icon NTV Telugu

Kishan Reddy: ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

కాచిగూడలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని ఆయన తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామన్నారు. తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకున్నాను.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ విధానాన్ని విమర‌్శంచే ముందు ఓటు హక్కు ముఖ్యమైంది.. ఓటు వేయకుండా ఎవరిని విమర్శించే ఛాన్స్ రాదని ఆయన చెప్పుకొచ్చారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చి డబ్బు, మద్యం ప్రభావంతో ఓట్లను కొనాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు.. ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్ల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉంది.. తమకు నచ్చిన వ్యక్తిని ఆలోచించి ఎన్నుకోవాలి అని కిషన్ రెడ్డి తెలిపారు. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.. తెలంగాణ ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటు వేసిన తర్వాతే రోజు వారీ పనులు చేసుకోవాలి.. తెలంగాణ సమాజం మొత్తం స్పందించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Exit mobile version