NTV Telugu Site icon

Kishan Reddy: త్రిభాషా పాలసీ కొత్తది కాదు.. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదు

Kishanreddy

Kishanreddy

తమిళనాడులో త్రిభాషా వివాదం రగులుకుంటోంది. రాష్ట్ర బడ్జెట్ లోగో నుంచి రూపాయి చిహ్నాన్ని స్టాలిన్ ప్రభుత్వం తొలగించింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా పాలసీ కొత్తది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటీ నుంచి ఈ విధానం కొనసాగుతుందని అన్నారు. నచ్చిన భాషలో చదువుకోవచ్చు. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని చెప్పారు.

Also Read:Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన.. తిరుమలలో విచారణ కమిటీ ఆరా..

ఇతర దేశాల్లో కూడా మాతృభాషలోనే మాట్లాడుతారు. డీఎంకే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. దేశంలో నూతన విద్యా విధానం వచ్చాక మాతృభాషకు ప్రోత్సాహం ఇచ్చాం. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ప్రజలను రెచ్చ కొట్టి అధికారం చేపట్టడం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాలుగున్నర సంవత్సరాలలో తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:Sachin Holi Celebrations: రంగులతో సచిన్ అల్లరి అంత ఇంతా కాదుగా!

దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోని సినిమాలు దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు అందిస్తున్నాయి. నియోజకవర్గ పునర్విభజనపై కొత్త నియమాలు రాలేదు. ఇంకా జనగణన జరగలేదు. ఈ అంశంపై ఏబిసిడిలు తెలియని సీఎం రేవంత్ యుద్ధం చేస్తా అని అంటున్నారు. దక్షిణ భారత ప్రజలు చైతన్యవంతులయ్యారు అక్షరాస్యత పెరిగింది. మీ పిచ్చి మాటలు నమ్మరు. రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.