Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు వారికి కూడా సుపరిచితుడే. వరుసగా సినిమాలు చేస్తున్న ఆయన తన అభిమానులకు షాక్ ఇచ్చారు. కిచ్చా సుదీప్ తన రిటైర్మెంట్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 28 ఏళ్లుగా కన్నడ ఇండస్ట్రీలో తన స్టార్ డమ్ కొనసాగిస్తున్న సుదీప్ కేవలం కన్నడలోనే కాదు మిగతా దక్షిణాది సినిమాలలో కూడా నటిస్తూ వచ్చారు. కన్నడ స్టార్ గా ఎదిగిన సుదీప్ తన సినిమా జర్నీని హీరోగా ఆపేస్తానని హింట్ ఇచ్చాడు. ఐతే తానింకా అలసిపోలేదు.. ఏదో ఒక టైం లో యాక్టింగ్ ఆపేస్తానని అభిమానులకు షాక్ ఇచ్చారు సుదీప్. అయితే ఎంత స్టార్ అయినా కూడా ఏదో ఒక టైం లో బోర్ కొట్టేస్తాడు. ప్రతిదానికీ ఓ టైం అనేది ఉంటుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఒక హీరోగా తానెప్పుడు ఎవరినీ సెట్ లో వెయిట్ చేయించలేదన్నారు. ఐతే తాను సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మరొకరి కోసం వెయిట్ చేస్తూ కూర్చోలేనని తెలిపారు సుదీప్. బ్రదర్, అంకుల్ పాత్రలు పోషించడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు సుదీప్.
Read Also:KTR: నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ..
ఇటీవల కొన్ని ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కొన్ని కథలు నచ్చక రిజెక్ట్ చేయలేదని.. ఈ టైం లో వాటిని చేయడం కరెక్ట్ కాదనే ఆ సినిమాలు చేయలేదన్నారు. నటనకు దూరమైనా ఇండస్ట్రీకి దూరం కానని హీరోగా పాత్రలు రానప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేస్తానన్నారు. కన్నడ ఆడియన్స్ కు దాదాపు 30 ఏళ్లుగా తన సినిమాలతో అలరిస్తూ వస్తున్న సుదీప్ సపోర్టింగ్ రోల్స్ చేయడం ఇష్టం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. తెలుగులో సుదీప్ 2012 లో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈగ అనే సినిమా చేశారు. ఈ సినిమా లో సుదీప్ విలనిజం అభిమానులను అలరించింది. సుదీప్ లేటెస్ట్ స్టేట్మెంట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈమధ్యనే మ్యాక్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుదీప్ మంచి టాక్ తెచ్చుకున్నారు. సౌత్ లో క్రేజీ స్టార్ గా సుదీప్ 30ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తుండగా తన మార్క్ నటనతో హీరోగా అదరగొట్టేస్తున్నారు.
Read Also:SA 20: భారీ సిక్సర్ కొట్టిన క్లాసెన్.. బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని