Kiara Adwani : కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాల లో నటించి మెప్పించింది.అలాగే సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెర కు పరిచయం అయింది.మొదటి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా లో కూడా నటించారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.దీనితో ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమాలలో నటిస్తూ మెప్పిస్తుంది.ఇక తాజాగా ఈమె రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వం లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీలో నటిస్తుంది.ఈ సినిమా ద్వారా తిరిగి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి కియారా సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కియారా అద్వానీ ఈ ఏడాది బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయినప్పటికీ కూడా ఈమె సినిమాల విషయంలో మాత్రం అస్సలు వెనకడుగు వేయడం లేదు. అలాగే గ్లామర్ షో చేయడానికి కూడా తాను సిద్ధమేనని ఆమె తెలియజేశారు.తాజా ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కథ తనకు నచ్చితే ఎలాంటి పాత్రలలో అయినా నటించడానికి తాను సిద్ధమేనని తెలిపారు. కథ తనుకు నచ్చకుండా రెమ్యూనరేషన్ అధికంగా ఇస్తామని తనకు భారీ ఆఫర్ ప్రకటించినా నాకు నచ్చని పని చేయనని ఆమె తెలిపింది. నచ్చని పాత్ర చేసి కెరీర్ నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదని కియారా తెలిపారు.ప్రస్తుతం కియరా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!