NTV Telugu Site icon

Kiara Advani : బోల్డ్ ఫోటో షూట్ తో మతి పోగొడుతున్న హాట్ బ్యూటీ..

Whatsapp Image 2023 08 19 At 6.45.27 Pm

Whatsapp Image 2023 08 19 At 6.45.27 Pm

కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటన తో బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది..తన నాజూకు అందాలతో కియారా అద్వానీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. ఈ భామ. ‘ఫగ్లీ’ సినిమా తో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఇప్పటి వరకు ఈ భామ ఇరవై కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకుంటుంది.బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది..కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది.ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో కూడా నటించింది.ఇక కియారా అద్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయి లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.కియారా అద్వానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో వీరిద్దరూ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.పెళ్లి తర్వాత కూడా ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.కియారా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.. ఈ భామ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు గ్లామర్ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది.తాజాగా కియారా షేర్ చేసిన ఫొటోలు నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.. బ్లాక్ డ్రెస్ లో దర్శమనిచ్చిన కియారా స్కిన్ షోతో మతులు పోగొట్టింది. హాట్ స్టిల్స్ తో రెచ్చగొట్టింది.ఎంతో బోల్డ్ గా కనిపించి అదరగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..

Show comments