Site icon NTV Telugu

Kiara Advani : ఆ సమయంలో నా భర్త నాకు అండగా నిలిచాడు..

Whatsapp Image 2023 07 21 At 1.48.50 Pm

Whatsapp Image 2023 07 21 At 1.48.50 Pm

కియార అద్వానీ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ అందుకున్న ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా పరిచయం అయింది.. తెలుగులో మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్న కియార ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది.. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఈమె తిరిగి బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేసింది.కొన్నాళ్ళ తరువాత ఈమె మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయింది.. ప్రస్తుతం ఈ భామ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.గేమ్ చేంజర్ సినిమా తరువాత తెలుగులో వరుసగా సినిమాలు చేయాలనుకుంటుంది ఈ భామ.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీ గా వున్నా డా ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉంది.ఈ భామ నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పెళ్లి అయినా కూడా ఈమె వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ భామ పై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీయారా పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించే విషయం పట్ల తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని తెలిపారు.. అయితే ఈ విమర్శలు వచ్చిన సమయంలో నా భర్త నాకు అండగా ఉన్నారని తను నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారని ఈమె తెలియజేశారు. అలాంటి నెగిటివ్ కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోకూడదు అంటూ నాకు ధైర్యం చెప్పారని తెలియజేసింది.ప్రస్తుతం ఈ భామ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version