NTV Telugu Site icon

OYO : కస్టమర్‌తో ఆ పని చేసిన హోటల్ యజమాని.. రూ.లక్ష చెల్లించాల్సిందే అన్న కోర్టు

New Project (68)

New Project (68)

OYO : కేరళలోని ఎర్నాకులంలోని ఓయో హోటల్‌లో ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రూమ్‌లు బుక్ చేశాడు. కానీ అతను హోటల్‌కు చేరుకోగానే, అతడికి ఊహించని షాక్ తగిలింది. ఆ వ్యక్తికి గది ఇవ్వడానికి హోటల్ యజమాని సున్నితంగా నిరాకరించాడు. దీంతో ఈ వ్యవహారం తీవ్రస్థాయికి చేరడంతో కోర్టు మెట్లెక్కింది. లక్షా 10 వేల జరిమానా చెల్లించాలని హోటల్ యజమానిని కోర్టు ఆదేశించింది. హోటల్ యజమానికి జరిమానా విధిస్తూ కోర్టు ఇలా చెప్పింది..‘ ఆన్‌లైన్ బుకింగ్ అప్లికేషన్ ద్వారా ముందుగానే గదులను బుక్ చేసుకున్నప్పటికీ, హోటల్ యజమాని కస్టమర్, అతని కుటుంబ సభ్యులకు గదిని అందించలేదు. దీంతో హోటల్ యాజమాన్యం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల, హోటల్ యజమాని కస్టమర్‌కు రూ.లక్ష చెల్లిస్తారు. కోర్టు ఖర్చులుగా రూ.10,000 కూడా చెల్లిస్తారు.

Read Also:Instagram: ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయం.. 20 రోజులు బంధించి యువతిపై లైంగిక దాడి..

కస్టమర్ అరుణ్ దాస్ తన ఫిర్యాదులో..‘‘ నేను నా పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కలిసి రాత్రి హోటల్‌కు వెళ్లాను. అయితే బుక్ చేసినా హోటల్ యజమాని మాకు గది ఇవ్వలేదు. ఆ రాత్రి మరో హోటల్‌ను కనుగొనడంలో మాకు చాలా ఇబ్బంది పడింది. అతి కష్టం మీద మేము ఆ రాత్రి మరో హోటల్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది..’’ అని పేర్కొన్నారు.

Read Also:Iphone 16 Launch: నేడే ‘ఐఫోన్ 16’ సిరీస్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఆ రాత్రి ఏమి జరిగిందో కస్టమర్ చెప్పాడు?
అరుణ్ దాస్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు 30 రోజుల్లోగా రూ.లక్ష పరిహారం, రూ.10,000 కోర్టు ఖర్చులు చెల్లించాలని హోటల్ యజమానిని కోర్టు ఆదేశించింది. రాత్రి 10 గంటల సమయంలో హోటల్‌కు చేరుకున్నప్పుడు, హోటల్ యజమాని మాకు గది ఇవ్వడానికి నిరాకరించారని ఫిర్యాదుదారు తెలిపారు. ఒక్కో గదికి రూ.2,500 అదనంగా డిమాండ్ చేశారు. పైగా, మా పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో రాత్రిపూట ప్రయాణించి వేరే హోటల్‌ను వెతుక్కోవలసి వచ్చింది. వినియోగదారుల కమిషన్‌ చైర్మన్‌ డిబి బిను, సభ్యులు వి రామచంద్రన్‌, టిఎన్‌ శ్రీవిద్య మాట్లాడుతూ.. ‘ఫిర్యాదుదారు కుటుంబానికి హోటల్‌ యజమాని ద్రోహం చేశారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసిక క్షోభకు గురైంది. అందువల్ల హోటల్ యజమానికి ఈ జరిమానా విధించబడింది.’’ అని తెలపారు.