Keeda Cola : తొలి రోజు భారీగా కలెక్షన్స్ సాధించిన కీడా కోలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తరుణ్ భాస్కర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో తరుణ్ భాస్కర్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘కీడా కోలా’.. ఈ సినిమా లో బ్రహ్మనందం, చైతన్య రావు మరియు రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు.సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత దాదాపు ఐదేండ్లు గ్యాప్ తీసుకుని తరుణ్ భాస్కర్ ఈ సినిమా తీయగా.. తొలి రోజు భారీగా వసూళ్లు రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిసింది.ఇక ‘కీడా కోలా’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్లు చూసుకుంటే.. రూ.6.03 కోట్లు వసూలైనట్టు వివిధ రిపోర్టులు చెబుతున్నాయి. రానున్న రెండు రోజులు వీకెండ్ కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.
మరోవైపు శుక్రవారం రోజే విడుదలైన సత్యం రాజేష్ ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా తొలిరోజు రూ. 3 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.. ఈ సినిమా కు కూడా మంచి హిట్ టాక్ రావడంతో ఈ రెండు సినిమాలకు మంచి పోటీ ఏర్పడింది.. కీడా కోలా కథ విషయానికి వస్తే..వాస్తు(చైతన్యరావు) అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. అందులోంచి బయటపడాలంటే డబ్బు అవసరం. జీవన్(జీవన్‌కుమార్).. అనుకోకుండా అవమానాలపాలవుతాడు. ప్రతీకారం తీరాలంటే అతను కార్పొరేటర్ కావాలి. దానికీ డబ్బే అవసరం. వాస్తు తన తాత వరదరాజులు(బ్రహ్మానందం)కోసం తెచ్చిన కూల్ డ్రింక్ లో బొద్దంక కనిపిస్తుంది. ఎలాగూ డబ్బు అవసరం కాబట్టి.. దీన్నే అదనుగా తీసుకొని, లీగల్‌గా ప్రొసీడవుతామని సదరు కూల్ డ్రింక్ కంపెనీ వారిని బెదిరించి సొమ్ము చేసుకుందామని వాస్తు మిత్రుడు, న్యాయవాది అయిన కౌశిక్(రాగ్‌మయూర్) సలహా ఇవ్వడంతో అసలు కథ మొదలవుఉంది. ఇక జీవన్ విషయానికొస్తే.. తన అన్న నాయుడు(తరుణ్‌భాస్కర్) జైలునుండి విడుదలవ్వడంతో.. అన్న అండతో ఎలాగైనా కార్పోరేటర్ అవుదామని ఎంతో ఆశపడతాడు. కానీ దానికి కూడా డబ్బే అవసరం కావడంతో వాళ్లు ఓ ప్లాన్ వేస్తారు… ఇంతకీ జీవన్ అండ్ బ్యాచ్ వేసిన ప్లాన్ ఏంటి? కూల్ డ్రింక్ కంపెనీ వాళ్లను బెదిరించి వాస్తు అండ్ బ్యాచ్ డబ్బులు కొట్టేసారా.. ఇంతకీ వాస్తు, జీవన్‌లు డబ్బులు సంపాదించగలిగారా… అనేది మిగిలిన కథ..క్రైం కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను వీజీ సైన్మా బ్యానర్‌పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్ మరియు ఉపేంద్ర వర్మ నిర్మించారు
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!