Kedarnath Yatra: నిరంతర భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌లలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం నిరంతర ప్రతికూల వాతావరణం కారణంగా సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ వద్ద ప్రయాణికులను నిలిపివేసింది. వర్షం కారణంగా 4 రాష్ట్ర రహదారులు, 10 లింక్ రోడ్లు శిధిలాల కారణంగా మూసివేయబడ్డాయి. భారీ వర్షాల కారణంగా మందాకిని, అలకనంద నదులు ఉప్పొంగుతున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: WFI Controversy: బ్రిజ్‌భూషణ్ విచారణ చేయబడతారు, శిక్షించబడతారు.. ఛార్జిషీట్‌లో పోలీసులు
ఇదిలావుండగా, ఈ ప్రాంతంలో భారత వాతావరణ శాఖ భారీ వర్షపాతం హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో చేసిన ముందస్తు జాగ్రత్తల గురించి ముఖ్యమంత్రి పుష్కర్ ధామి మాట్లాడుతూ.. “ప్రతి సంవత్సరం ఇక్కడ వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అధిక వర్షపాతం వల్ల కొండచరియలు విరిగిపడతాయి, నదుల నీటిమట్టం పెరుగుతోంది. అధికారులు పూర్తి అలెర్ట్ మోడ్‌లో ఉన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నవారు తమ పనిని చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వారందరూ అలర్ట్ మోడ్‌లో ఉన్నారు. ఇతర సంస్థలు కూడా దీనిపై పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, పీడబ్ల్యూడీ డిపార్ట్‌మెంట్ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారికి సహాయం చేయడానికి మేము నిరంతరం ప్రజలతో టచ్‌లో ఉంటాము.” అని సీఎం పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. మంగళవారం, ఉత్తరాఖండ్‌లోని గంగ్నాని సమీపంలో గంగోత్రి జాతీయ రహదారిపై శిథిలాలు పడి నలుగురు వ్యక్తులు మరణించగా.. 10 మంది గాయపడ్డారు.