NTV Telugu Site icon

Karthi ‘Japan’ : విడుదలైన కార్తీ ‘జపాన్’ ఫస్ట్ లుక్

Japan 12

Japan 12

Karthi ‘Japan’ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు కార్తీ హీరోగా నిర్మిస్తున్న తన కొత్త చిత్రం ‘జపాన్’. ఈ సినిమాకు ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకి ఇది 25వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. అందులో కార్తీ చేతిలో మద్యం బాటిల్‌తో సోఫాలో నిద్రపోతున్నట్లు చూపించారు. ఇదే పోస్టర్ లో ఓ అమ్మాయి చేతిలో గ్లాస్‌తో నేలపై పడుకుని ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈసినిమాలో తొలిసారి కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఫస్ట్ టైమ్ నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Show comments