NTV Telugu Site icon

Karnataka: బ్యాంక్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఆ నిర్ణయం తీసుకోనున్న రాష్ట్రప్రభుత్వం

Bank

Bank

Local Language Mandatory For Bankers: దేశంలో బ్యాంకింగ్ రంగం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు కూడా బ్యాంకింగ్ రంగంపై అవగాహన పెరగడంతో వారు కూడా ఎక్కువగా బ్యాంకులకు వెళుతున్నారు. ఇక ప్రభుత్వాలు అందించే అన్ని స్కీమ్ ల డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. దీంతో సాధారణ జనం చాలా మంది బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అయితే స్కీంలకు సంబంధించిన వివరాలు కానీ, ఇన్యూరెన్స్ లాంటి విషయాలు కానీ, మరే ఇతర విషయాల గురించి అయినా తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్లిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  బ్యాంకులో పని చేసే చాలా మందికి అక్కడి స్థానిక బాష రాకపోడం దీనికి ప్రధాన కారణం.

Also Read:  Rajasthan: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన 13 ఏళ్ల బాలిక.. బాత్రూంలోనే ప్రసవం

బ్యాంకులు కేవలం వారి రాష్ట్రానికి చెందిన వారిని కాకుండా అన్ని రాష్ట్రాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఐబీపీఎస్ లాంటి పరీక్షలు రాసి దేశంలో ఎక్కడైనా ఉద్యోగం పొందవచ్చు. కేవలం గవర్నమెంట్ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులైన హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ లాంటి బ్యాంకులు కూడా బ్యాంకింగ్ ప్రోగ్రామ్ ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో వారికి అక్కడి భాష నేర్చుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది. ఈలోపు కస్టమర్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మేనేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే కొంతమందికి ఇబ్బందిగా మారింది. బ్యాంక్ సేవలు అందించడానికి అడ్డంకిగా మారుతుంది. ఇంగ్లీష్ రాని, అర్థం కాని కస్టమర్ల పరిస్థితి ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా గవర్నమెంట్ కు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులందరూ కచ్ఛితంగా స్థానిక భాషలో మాట్లాడాలని ఆదేశించనుంది. ఇది కనుక అమలులోకి వస్తే బ్యాంకులన్ని ఎక్కువగా కన్నడీగులకే అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది.

Show comments