ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య. వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
Also Read : Tollywood Actress : వరుస ప్లాపులు.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి పరిమితమైన హాట్ బ్యూటీ
రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. బాలయ్యతో గోపీచంద్ మలినేని చేయబోయే ఈ సినిమా టైమ్ ట్రావెల్ లాంటి కథనంతో హిస్టారికల్ నేపథ్యంలో రాబోతుంది. ఇప్పటికి స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేసాడు గోపించంద్ మలినేని. అయితే ఈ సినిమా కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అర్వింద్ కశ్యప్ వర్క్ చేయబోతున్నారు. ఇప్పటికే కథ చర్చలు ముగిశాయి. కన్నడ ఇండస్ట్రీ హిట్ అయిన కాంతార, కాంతార చాప్టర్ 1 సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత వంటి సినిమాలకు అర్వింద్ కశ్యప్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించాడు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అద్భుతమైన విజువల్స్ మరియు సినిమాటిక్ గ్రాండియర్‌గా బాలయ్య – గోపిచంద్ సినిమా ఉండబోతుందనడంలో సందేహం లేదు. డాకు మహారాజ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్.కూడా బాలయ్యను అద్భుతంగా చూపించాడు. అందుకే బాలయ్య సినిమాలకు రెగ్యులర్ గా ఉండే డీఓపీని కాదని అర్వింద్ కశ్యప్ తో వెతున్నారు NBK111 టీమ్.
