ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో పంతుళ్ల లొల్లి చర్చనీయాంశంగా మారింది. ఈవో శీనా నాయక్‌పై పంతుళ్లు అలకబూనారు. ఈరోజు ఇంద్రకీలాద్రిపై శాకాంభారీ ఉత్సవాలు ఆఖరి రోజు కావడం, అందులోనూ గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఇంద్రకీలాద్రి మొత్తం కిక్కిరిసిపోయింది. కొండపైన ఎక్కడ చూసినా భక్తులే ఉన్నారు.
Also Read: ENG vs IND: బజ్‌బాల్‌పై వెనక్కి తగ్గిన ఇంగ్లండ్.. ఇదే మొదటిసారి!
300 రూపాయలు క్యూ లైన్‌లో రూ.100 ఇస్తే.. కొందరు పంతుళ్లు ఆశీర్వాదం, అక్షింతలు, తాయత్తు కట్టారు. ప్లేట్ కలెక్షన్ పేరుతో కొంతమంది పంతుళ్లు డబ్బులు వసూల్ చేశారు. భక్తులు ఎగబడడంతో 300 రూపాయలు క్యూ లైన్‌లో రద్దీ పెరిగింది. లైన్ ముందుకు కదల్లేదు. ఈ విషయం ఈవో శీనా నాయక్ దృష్టికి వెళ్లగా.. ఆశీర్వాదం పేరుతో చేస్తున్న ప్లేట్ కలెక్షన్ నిలిపివేశారు. ఈవో నిర్ణయంపై పంతుళ్లు ఆగ్రహించారు. అమ్మవారి అంతరాలయ అనంతరం ఆశీర్వాదం చేసే చోటా కూడా కలెక్షన్ ప్లేట్ పెట్టవద్దని పంతుళ్లు అందరూ బైఠాయించారు. పంతుళ్ల బైఠాయింపుతో అంతరాలయంలో వీవీఐపీ భక్తులకి శత గోపురం కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది.
