NTV Telugu Site icon

Minister KTR : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు.. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే

Minister Ktr Kamareddy

Minister Ktr Kamareddy

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారక రామారావును కామారెడ్డి రైతు జేఏసీ బృందం కలిసింది. ఈ సందర్భంగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్… ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు.

Also Read : IRCTC: దక్షిణ భారత తీర్థయాత్రల స్పెషల్.. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు మంత్రి కేటీఆర్‌. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తెలిపిన కేటీఆర్‌కు రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిసింది. రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకొని… రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు మంత్రి కేటీఆర్‌.

Also Read : Babu Mohan: ఈసారి పోటీ చేయడం లేదు.. బీజేపీకి రాజీనామా చేస్తా: బాబు మోహన్