Site icon NTV Telugu

Kamal Hasan : “ఇండియన్ 2” రిలీజ్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన లోకనాయకుడు..

Whatsapp Image 2024 05 19 At 9.16.56 Am

Whatsapp Image 2024 05 19 At 9.16.56 Am

Kamal Hasan :విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.గతంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన “ఇండియన్” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది.అయితే ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ ను దర్శకుడు శంకర్ పూర్తి చేసారు.ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధం అయింది.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే బాబీ సింహా,ఎస్ జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాను జూన్ నెల విడుడల చేయనునట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.అయితే రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు.జూన్ లో ప్రభాస్ “కల్కి” సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్త బాగా వైరల్ అయింది.అయితే తాజాగా ఇండియన్ 2 సినిమా రిలీజ్ గురించి లోకనాయకుడు కమల్ హాసన్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.తాను నటించిన “ఇండియన్ 2 ” సినిమా జులై లో రిలీజ్ అవుతుందని ఆయన ప్రకటించారు.అలాగే “ఇండియన్ 3 ” సినిమా రిలీజ్ గురించి కూడా కమల్ అప్డేట్ ఇచ్చారు.ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయిన 6 నెలలకు ఇండియన్ 3 ని థియేటర్స్ లోకి తీసుకోని వస్తామని అన్నారు.కథ చాల పెద్దది కావడంతో మూడో పార్ట్ ను రూపొందించామని పేర్కొన్నారు.జూన్ 1 న ఇండియన్ 2 మూవీ ఆడియో లాంచ్ చేస్తామని కమల్ తెలిపారు.

Exit mobile version