NTV Telugu Site icon

Kalki 2898 AD : మధుర లో కల్కి థీమ్ సాంగ్ రివీల్..

Kalki (4)

Kalki (4)

Kalki 2898 AD : ప్రభాస్ నటించిన కల్కి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులలో అంచనాలు భారీగా వున్నాయి.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న రిలీజ్ చేస్తున్నారు.

Read Also :Nani : దసరా కాంబినేషన్ రిపీట్.. హీరోయిన్ ఎవరంటే..?

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె, సినిమాపై అంచనాలు పెంచేసాయి.తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయగా ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.ఈ ట్రైలర్ లో హాలీవుడ్ స్థాయి విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇదిలా ఉంటే మరో మూడు రోజులలో కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.దీనితో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు.తాజాగా “కల్కిలోని థీమ్ సాంగ్ ను యూపీలోని మధురలో రివీల్ చేస్తూ మేకర్స్ ప్రోమోను రిలీజ్ చేసారు.త్వరలోనే పూర్తి సాంగ్ ను రిలీజ్ చేస్తామని వెల్లడించారు.