NTV Telugu Site icon

Kalki 2898AD : ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టిన కల్కి

Kalki (1)

Kalki (1)

Kalki 2898AD : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఏ నోట విన్నా కల్కి 2898 ఏడీ పేరే సంచలనం అవుతుంది. ఈ సినిమా అంతలా ప్రభావాన్ని చూపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం పై విడుదలకు ముందు నుంచే ఎన్నో అంచనాలున్నాయి. బుధవారం ఎంతో గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో పాటు రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఫలితంగా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. తెలుగు హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. 600కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, విజయ్ దేవరకొండ కీలక పాత్రలు పోషించారు.

Read Also:Janasena Chief: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఏపీలో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు మొత్తంగా కలుపుకుని రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది. టెక్నికల్ వండర్‌గా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాకు మొదటి రోజు అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 48 కోట్లు షేర్ వసూలు చేసింది. ఓన్లీ నైజాం ఏరియాలో కల్కి సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా 23.55కోట్లు కొల్లగొడితే .. ప్రభాస్ కల్కి 24కోట్లను వసూలు చేసింది. మిగతా ప్రాంతాల్లో ఇంకా అఫీషియల్ కలెక్షన్ల వివరాలు వెలుగులోకి రాలేదు. మొదటి రోజు రూ. 200 కోట్లు క్రాస్ చేస్తుందని అంచనా.

Read Also:Chandrababu: నేడు వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సమీక్ష..