Kalki 2898 AD Likely To Sreaming on Amazon Prime Video from August 15: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. భారీ తారాగణంతో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన కల్కి.. రూ.1000 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. కల్కి కలెక్షన్స్ చూస్తే. రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కల్కి 2898 ఏడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. స్పెషల్ డే ఆగస్టు 15 నుంచి కల్కి స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను రెండు సంస్థ దక్కించుకున్నాయట. దక్షిణాది భాషలకు సంబంధించిన హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. హిందీ రైట్స్ మాత్రం నెట్‌ఫ‍్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. కల్కి కోసం అమెజాన్ ప్రైమ్ భారీగానే వెచ్చించిందట.
Also Read: IND vs ZIM: నేడు జింబాబ్వేతో మూడో టీ20.. ప్రపంచకప్ విన్నర్స్‌కు చోటు! బెంచ్‌కే జైస్వాల్
థియేట్రికల్ రిలీజ్ 7-8 వారాల తర్వాత కల్కి 2898 ఏడీను ఓటీటీలోకి తీసుకురావాలని ఓటీటీ సంస్థలతో నిర్మాతలు ముందే డీల్ కుదుర్చుకున్నారట. ఇందులో భాగంగానే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి కల్కి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. రూ.700 కోట్లతో కల్కిని నిర్మించినట్లు నిర్మాత అశ్వినీ దత్ చెప్పిన విషయం తెలిసిందే. మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, అన్నా బెన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కేవీ అనుదీప్, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ చేశారు.