NTV Telugu Site icon

Kakani Govardhan Reddy : రైతులకు అండగా మరో కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించాం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

Kakani Govardhan

Kakani Govardhan

సీఎం జగన్‌ నేడు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నగదును జమ చేశారు. అయితే.. ఈ సందర్భంగా తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు అండగా మరో కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించామన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణం.. గతంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఆత్మహత్యలకు పాల్పడే వారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కరువు మండలాలు ఉండేవని, రాష్ట్రంలో ఇవాళ కరువు ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం లేని పరిస్థితి అన్నారు. అంతేకాకుండా.. ‘చంద్రబాబు 2014లో రుణ మాఫీ హామి ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేశాడు. 13 లక్షల టన్నుల ధాన్యం అధికంగా సగటున గత మూడేళ్ల నుంచి ఉత్పత్తి అవుతోంది. ఇప్పటం గ్రామానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎలా డ్రామాలు చేశారో చూశాం. కోర్టు తీర్పుతో పవన్ కళ్యాణ్ కు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి.
Also Read : Minister RK Roja : రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారు

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. హైకోర్టు ఇచ్చిన రాజధాని నిర్మాణానికి నిర్ధిష్ట కాల పరిమితి తీర్పు పై మేం సుప్రీంకోర్టును ఆశ్రయించాం. చంద్రబాబుకు తన బినామీ భూముల విలువ తగ్గుతుందన్న బాధ. అందుకే అనేక అడ్డంకులను సృష్టిస్తున్నాడు. మేం ఒక్కొక్క అడ్డంకిని అధిగమిస్తూ వెళతాం. మా ప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు దగ్గర కన్విన్స్ చేయగలం అనే నమ్మకం ఉంది. మేము రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగ స్ఫూర్తితోనే నిర్ణయాలు తీసుకున్నాం. రైతులకు అత్యధిక మేలు చేసేది మా ప్రభుత్వమే. అమరావతి ప్రాంత రైతులకు ఏ మాత్రం నష్టం లేకుండా మేం చర్యలు తీసుకుంటున్నాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. అన్ని అడ్డంకులు అధిగమించిన వెంటనే విశాఖకు పాలనా రాజధాని ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా విధానం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Amazon India: అమెజాన్ మరో సంచలన నిర్ణయం.. వారంలో మూడోది బంద్