Kajal Agarwal : బిగ్ బాస్ లో సందడి చేసిన కాజల్.. వైరల్ అవుతున్న పిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది….ఈ బ్యూటీ పేరు కొన్ని రోజులుగా నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సత్య భామ.. కాజల్ 60 వ సినిమా గా తెరకెక్కుతున్న సత్యభామ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది..సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు.సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.సత్యభామ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో నటిస్తోంది.క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా “సత్యభామ” టీజర్ రీసెంట్ గా విడుదల చేశారు.టీజర్ ఎంతో ఆసక్తి కలిగిస్తుంది..
హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతుంటుంది. పై అధికారులు సత్య..ఈ కేసు నీ చేతుల్లో లేదు అని చెబితే..కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ అంటుంది సత్య.అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది సత్యభామ. ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంటుంది.టీజర్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తుంది..ప్రస్తుతం కాజల్ సత్యభామ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ బ్యూటీ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో సందడి చేసింది. బిగ్ బాస్ కంటెస్టంట్లతో సరదాగా ముచ్చటించింది. రెడ్ డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్స్ నెటిజన్ల ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఎపిసోడ్ ఇవాళ రాత్రి స్టార్ మాలో ప్రసారం కానుంది.. కాజల్ అగర్వాల్ సత్య భామ సినిమాతో పాటు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2లో హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- 10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!