NTV Telugu Site icon

Kajal Aggarwal : ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నా .. అందుకే ‘సత్యభామ’ లో నటించా..

Kajal (1)

Kajal (1)

Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత హీరోయిన్ గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ‘భగవంత్ కేసరి’సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం కాజల్ “సత్యభామ”అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా లో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు.సుమన్ చిక్కాల ఈ సినిమాను తెరకెక్కించిన ఈ సినిమాను బాబీ తిక్క మరియు శ్రీనివాసరావు తక్కలపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.

Read Also :RC 16 : రాంచరణ్ సినిమా కోసం భారీ సెట్ నిర్మాణం ..

ఇప్పటికే ఈ సినిమా నుంచి రీలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ లాంచ్ చేసారు.ఈ ట్రైలర్ చూస్తుంటే కాజల్ సత్యభామగా అద్భుతంగా నటించింది.ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో కాజల్ అద్భుతంగా నటించింది.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.సత్యభామ కంటే ముందుగానే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసే అవకాశం వచ్చింది .కానీ ఇలాంటి సినిమాలు చేసే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అప్పుడు రాలేదు.ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.సత్యభామ సినిమాతో నా కోరిక తీరిందని కాజల్ తెలిపింది.

Show comments