Site icon NTV Telugu

Kajal Agarwal : ఆ విషయంలో నేను ఎంతో హ్యాపీగా వున్నాను..

Whatsapp Image 2023 07 23 At 1.00.17 Pm

Whatsapp Image 2023 07 23 At 1.00.17 Pm

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా హిందీ లో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సాధించింది ఈ భామ. అయితే కాజల్ అగర్వాల్ కొన్నాళ్ళ పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.తనకి పెళ్లి జరిగి బిడ్డ కూడా జన్మించడంతో కాజల్ సినిమాల నుండి కొంత బ్రేక్ తీసుకున్నారు.తన కుమారుడు కాస్త పెద్ద కావడంతో తిరిగి ఈమె సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చారు.. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాతో పాటు బాలకృష్ణ తో నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్ లతో చాలా బిజీ గా ఉంది.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ భామకు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొనింది. అక్కడ కాజల్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాను ముంబైలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసాను అని తెలిపింది.తనకు హీరోయిన్ గా అవకాశాలు కూడా వచ్చాయని తెలిపింది..సినిమా అవకాశాలు రావడంతో తన చదువుకు బ్రేక్ పడిందని కాజల్ ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే తన తండ్రి పలు వ్యాపారాలు చూసుకుంటూ ఎంతో బిజీగా ఉండేవారు. దీంతో తన సినిమా వ్యవహారాలన్నింటినీ కూడా తన తల్లి చూసుకునేవారని ఆమె తెలిపారు. అయితే పెళ్లి అయిన తర్వాత తన భర్త తన తల్లిదండ్రుల బాధ్యతలను చూసుకుంటూనే తన సినిమా వ్యవహారాలన్నింటిని దగ్గరుండి చూసుకుంటున్నట్లు కాజల్ తెలిపారు..ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే నిజ జీవితంలో భర్తతో ఎంతో హ్యాపీగా వున్నాను అని తెలియజేసింది కాజల్.

Exit mobile version