Kadiyam Srihari: కాంగ్రెస్ కు బొటాబొటి మెజార్టీ ఉందని, కాంగ్రెస్ లో గ్రూప్స్ కామన్ అని, వాళ్ల మీద వాళ్ళకే నమ్మకం లేదని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తను మాట్లాడిన విషయం తప్పుగా ప్రెజెంట్ చేశారని అన్నారు. ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళ హామీలకు సహకరించదని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది అని అన్నారు. బలమైన ప్రతిపక్ష ఉంది. మీరు బాగా పని చేయాల్సి ఉందని చెప్పాను అని క్లారిటీ ఇచ్చారు. మేము అన్న దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు.. భయపడుతున్నారని అన్నారు. అందుకే మేము ఒకటి మాట్లాడితే వాళ్ళు పదీ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.
Read also: Bhatti Vikramarka: డిప్యూటీ సీఎంగా భట్టి బాధ్యతలు.. నిధులు మంజూరు చేస్తూ సంతకాలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ కార్మికులంతా ఏడాది పాటు ఓపిక పట్టాలని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. లక్ష్యంపై దాడి చేసేందుకు సింహం రెండడుగులు వెనక్కి వేసిందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కేసీఆర్ కూడా అదే దారిలో తిరుగుతారు. కేసీఆర్ మళ్లీ వస్తారంటూ.. కొన్ని లెక్కలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు, దాని మిత్రపక్షం ఎంఐఎంకు 7 సీట్లు, బీజేపీకి 8 సీట్లు ఉన్నాయని.. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు చేశారు. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ దుస్థితిలో ఉందని.. ఆ పార్టీ ఉసిరికాయ కట్ట లాంటిదని అన్నారు. ప్యాకేజి తెరిపిస్తే అమల ఏం చేస్తాడో తెలియదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా ఒక్కటవుతారు. ఏడాది పాటు ఓపిక పడితే ఫలితం కనిపిస్తుంది. సింహం తిరిగొస్తుంది.. బీఆర్‌ఎస్‌కు మంచి రోజులు వస్తాయి. ఎవరూ ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు సూచించారు.
Best SIP Plan : ఛాయ్, సిగరెట్ డబ్బులతో మీరు కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగో తెలుసా?
