రోజురోజుకీ మోసగాళ్ళు ఎక్కువైపోతున్నారు. కడప జిల్లాలో సంచలనం రేపిన జీవి ఫుట్ బాల్ బెట్టింగ్ యాప్ మోసాలపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కడప వన్ టౌన్ పోలీసులు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారంతో సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా ఈ స్కేసులో 13 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. మరికొందరు నిర్వాహకులను సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా గుర్తించారు. ఈ యాప్ ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు పోలీసులు.
Read Also: Twitter CEO: ట్విటర్‌కు ఎలాన్ మస్క్ గుడ్‌బై.. కొత్త సీఈవో ఎవరో తెలుసా?
బెట్టింగ్ యాప్ ద్వారా ప్రజలను జూదం లోకి దింపిన కీలక వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.. సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చేసిన శిరీష అనే నిర్వాహకురాలికి కడప వన్ టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శిరీష ను విచారిస్తే జీవి బాల్ బెట్టింగ్ యాప్ మూలాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పోలీసుల సుమోటో కేసుతో జివిపుట్ బాల్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో బెట్టింగ్ నిర్వాహకులు మూన్ పుట్ బాల్ యాప్ పేరుతో మరో కొత్త బెట్టింగ్ యాప్ ను తెరపైకి తెచ్చారు. ప్రజలు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఈ యాప్ ల వల్ల నష్ట పోవద్దని వన్ టౌన్ సీఐ నాగరాజు విజ్ఞప్తి చేశారు
Read Also:Rachakonda Crime: రాచకొండ పరిధిలో దారుణం.. వ్యక్తి పై ఇనుప రాడ్డులతో కత్తులతో దాడి