కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన కాటేరా చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ యాక్షన్ మూవీ అద్భుత విజయం సాధించింది.కన్నడలో మాత్రమే విడుదలైన ఈ మూవీ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సత్తా చాటింది.ఇదిలా ఉంటే కాటేరా చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకెళుతోంది. కాటేరా చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటింది. దీంతో ఈ చిత్రం రికార్డులను బ్రేక్ చేసిందంటూ జీ5 ఓటీటీ వెల్లడించింది.కాటేరా చిత్రం ప్రస్తుతం కన్నడ భాషలో మాత్రమే ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ తో జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒకే భాషలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం 5 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ దూటడం విశేషం.. ఇతర భాషల వారు కూడా ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ తో కటేరా మూవీని బాగానే చూస్తున్నారని దీని ద్వారా తెలుస్తుంది.కాటేరా చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. అలాగే జగదీశ్ కుమార్ హంపీ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు. రాక్‍లైన్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై రాక్‍లైన్ వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.1970ల నాటి బ్యాక్‍డ్రాప్ తో కాటేరా మూవీ తెరకెక్కింది.. భూస్వాముల చేతుల్లో రైతులు, నిమ్నవర్గాల ప్రజలు అణచివేతకు గురవడం కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన అంశంగా చూపించారు.ఇనుప పనిముట్లను, ఆయుధాలను తయారు చేసే కమ్మరి ‘కాటేరా’ పాత్రలో దర్శన్ నటించారు. ఆయన యాక్టింగ్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆరాధనా రామ్ హీరోయిన్‍గా నటించారు. జగపతి బాబు, కుమార్ గోవింద్, వినోద్ కుమార్ అల్వా, శృతి మరియు వైజనాత్ బిర్దార్ కీలకపాత్రలు పోషించారు.
ದಾಖಲೆಯ ಸರದಾರ ಅಂತ ಸುಮ್ನೆ ಕರಿಯಲ್ಲ ಇವ್ರ್ನ. 100 ಮಿಲಿಯನ್ ಮಿನಟ್ಸ್ ವೀಕ್ಷಣೆ ದಾಟಿದ ಕಾಟೇರ. ನೋಡಿ ನಿಮ್ಮ ZEE5 ನಲ್ಲಿ.#Kaatera #KaateraOnZEE5 @dasadarshan @TharunSudhir @RocklineEnt @Aradhanaa_r @harimonium @aanandaaudio @IamJagguBhai #DBossMassOnZEE5 #WatchOnZEE5 #ZEE5 #ZEE5Kannada pic.twitter.com/KXDcbVljNr
— ZEE5 Kannada (@ZEE5Kannada) February 14, 2024