Site icon NTV Telugu

Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఫలితాలపై లేఖ విడుదల చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి..

Sudarshan

Sudarshan

Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఫలితాలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ విడుదల చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పును స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.. “ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో స్వీకరిస్తున్నా.. ఈ ప్రయాణం నాకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చింది.. న్యాయం, ప్రతీ వ్యక్తి యొక్క గౌరవం కోసం నిలబడే అవకాశం అందించింది. నన్ను కూటమి అభ్యర్థిగా పెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. ఉపాధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు.” అని లేఖలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి రాసుకొచ్చారు.

READ MORE: Vice Presidential Election: ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ.. 20 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్..!

కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 767 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 752 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. మిగతా15 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. సీపీ రాధాకృష్ణన్ 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు పొందగా, ఇండియా బ్లాక్ అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండియా అలయన్స్ కు చెందిన కనీసం 20 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఊహించిన దానికంటే 25 ఓట్లు ఎక్కువగా పొందారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థికి మద్దతుదారుల పూర్తి స్థాయిలో ఓట్లు రాలేదు.

READ MORE: Sathyan Sivakumar: 500 ఎకరాల ఆస్తికి వారసుడు ఈ తమిళ నటుడు, ఒక్క తప్పుతో అంతా నాశనం..

Exit mobile version