New CJI: కొత్త సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New CJI: సీజేఐ నియామక సంప్రదాయ ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును అక్టోబర్ 11న కేంద్రానికి సిఫారసు చేశారు. దానిని రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపడంతో జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి సోమవారంనాడు ఆమోదం తెలిపారు. సీజేఐ పదవిలో జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు అంటే 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారంనాడు ఒక ట్వీట్‌లో ఈ విషయం తెలిపారు. కొత్త సీజేఐకి అభినందనలు తెలిపారు.
జస్టిస్ చంద్రచూడ్ గురించి కొన్ని ముఖ్య విషయాలు.. ఎక్కువ కాలం భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వైసీ చంద్రచూడ్ కుమారుడే ఈ జస్టిస్ డీవై చంద్రచూడ్. తండ్రి, కొడుకులు భారత ప్రధాన న్యాయమూర్తులుగా పని చేయడం దేశంలో ఇదే మొదటిసారి. అసమ్మతిని ప్రజాస్వామ్య సేఫ్టీ వాల్వులని భావించే జస్టిస్ చంద్రచూడ్.. అయోధ్య భూ వివాదం, గోప్యత హక్కు సహా అనేక రాజ్యాంగ బెంచ్‌లతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మైలురాయి తీర్పులలో ఈయన భాగంగా ఉన్నారు. ఐపీసీలోని సెక్షన్ 377 అంశంలోని స్వలింగ సంబంధాలను నేరరహితం చేయడం సహా ఆధార్ పథకం చెల్లుబాటు, శబరిమల సమస్యను పాక్షికంగా కొట్టివేత వంటి తీర్పులు వెలువరించిన బెంచ్‌లలో చంద్రచూడ్ ఉన్నారు. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం పరిధిని, గర్భం దాల్చిన 20-24 వారాల మధ్య అబార్షన్ కోసం అవివాహిత స్త్రీలను చేర్చడానికి సంబంధిత నిబంధనలను విస్తరించింది. న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో ఆనర్స్‌తో బీఏ పూర్తి చేసిన ఆయన.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి ఎల్ఎల్బీ చేశారు. అనంతరం హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్ఎల్ఎం డిగ్రీ, జురిడికల్ సైన్సెస్‌లో డాక్టరేట్ పొందారు.
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
తాజావార్తలు
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!