Site icon NTV Telugu

Jr NTR: మహిళలను గౌరవించడం పుట్టుకతోనే రావాలి.. .. నా ఇద్దరు కొడుకులను అలాగే పెంచుతా!

Jr Ntr

Jr Ntr

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మహిళా గౌరవంపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎలా గౌరవించాలో నిరంతరం గుర్తు చేయాల్సిన అవసరం రాకూడదని, ప్రతి మగాడు పుట్టుకతోనే మహిళలను గౌరవించే సంస్కారాన్ని కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. “మహిళలను గౌరవించడం గురించి పదే పదే గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. నిజానికి ఒక పురుషుడు పుట్టడమే మహిళల పట్ల గౌరవంతో పుట్టాల్సిన సమయం ఆసన్నమైంది” అని తారక్ అభిప్రాయపడ్డారు. ఈ మార్పు మన ఇళ్ల నుంచే మొదలవ్వాలని, పిల్లలకు చిన్నతనం నుంచే సరైన విద్యను అందించాలని ఆయన సూచించారు.

Also Read : Nayanthara: నయనతార నెక్స్ట్ ప్లాన్ అదిరిపోయిందిగా!

ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ.. “నా ఇద్దరు కొడుకులు (అభయ్ రామ్, భార్గవ్ రామ్) మహిళలను గౌరవిస్తూ పెరిగేలా నేను కచ్చితంగా చూసుకుంటాను” అని తారక్ భరోసా ఇచ్చారు. కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో హుందాగా వ్యవహరించే ఎన్టీఆర్, మహిళా భద్రత, గౌరవం గురించి ఇలాంటి మెచ్యూర్డ్ కామెంట్స్ చేయడం పట్ల మెగా, నందమూరి అభిమానులతో పాటు సామాన్యులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఉమెన్స్ డే రోజున ఆయన ఇచ్చిన ఈ మెసేజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version