Jowar Rava Upma Recipe: నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి జొన్నలు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారాయి. పీచు పదార్థం (Fiber) పుష్కలంగా ఉండే జొన్న రవ్వతో వివిధ వంటకాలు చేసుకోవడంతో ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం (Sugar) ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి జొన్న రవ్వతో చేసే ఉప్మా ఒక ఉత్తమమైన అల్పాహారం. ఆఫీసులకు వెళ్లేవారికి, ఉదయం పూట వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నవారికి జొన్న రవ్వ ఉప్మా ఒక బెస్ట్ ఆప్షన్. కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మీ కోసం స్టెప్-బై-స్టెప్ ఇక్కడ చూసేయండి..
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
కావలసిన పదార్థాలు:
* జొన్న రవ్వ: 1 కప్పు
* నీళ్లు: 3 కప్పులు (ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల నీళ్లు)
* నూనె: 2 టేబుల్ స్పూన్లు
* పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు
* కూరగాయలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ లేదా బఠానీలు
* ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
* ముందుగా ఒక బాణలిలో రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి.
* అలా పోపు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి . ఇవి కాస్త వేగాక, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, స్వీట్ కార్న్ లేదా బఠానీలు వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి.
Ashok Sharma: ఎవరయ్య ఈ ‘స్పీడ్ గన్’ బౌలర్.. 154.2 కిలోమీటర్ల వేగంతో బెంబేలు ఎత్తించాడుగా..!
* కూరగాయలు మగ్గిన తర్వాత, ఒక కప్పు జొన్న రవ్వకు మూడు కప్పుల చొప్పున నీటిని పోయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి, నీటిని బాగా మరిగించాలి.
* నీళ్లు మరుగుతున్నప్పుడు జొన్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, మూత పెట్టి సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు రవ్వ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
* రవ్వ నీటిని పూర్తిగా పీల్చుకుని దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆపి, ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వేడివేడి జొన్న రవ్వ ఉప్మాను సర్వ్ చేసుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
జొన్నల్లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను (Diabetes Control) అదుపులో ఉంచుతుంది. ఇందులో ఐరన్ & యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పద్ధతిలో జొన్న రవ్వ ఉప్మా చేసుకుంటే అటు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇటు రుచికి రుచి లభిస్తుంది.
