NTV Telugu Site icon

John Shaw passed away: బయోకాన్‌ సీఈవో కిరణ్ మజుందార్‌ షా భర్త కన్నుమూత

John Shaw Min

John Shaw Min

John Shaw passed away: ప్రముఖ పారిశ్రామిక వేత్త, బయోకాన్‌ సంస్థ సీఈవో కిరణ్ మజుందార్‌ షా భర్త జాన్‌ షా(73) ప్రాణాలు కోల్పోయారు. ఆయన సోమవారం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. జాన్‌ షా అంతిమ సంస్కారాలను బెంగళూరులోని విల్సన్‌ గార్డెన్స్‌ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు షా కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.1998లో జాన్ షా – కిరణ్‌ మజుందార్‌ వివాహం జరిగింది.

Coimbatore Cylinder Blast : కోయంబత్తూర్ గ్యాస్ సిలిండర్ పేలుడులో ఉగ్ర లింకులు..

జాన్‌ షా స్కాట్లాండ్‌కు చెందిన జాన్‌ గ్లాస్గో యూనివర్సిటీ నుంచి హిస్టరీ, పొలిటికల్‌ ఎకానమీలో ఎంఏ పూర్తిచేశారు. గతంలో మధురా కోట్స్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా, కోట్స్ వియెల్లా గ్రూప్‌కు ఫైనాన్స్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. బయోకాన్‌ లిమిటెడ్‌కు వైస్‌ ఛైర్మన్‌గా పని చేశారు. వివాహం తర్వాత ఆయన బయోకాన్‌లో చేరారు. 1999 నుంచి బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో సభ్యుడిగా ఉన్నారు. 2001లో కంపెనీ వైస్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కంపెనీ విదేశీ ప్రమోటర్‌గా, అడ్వైజరీ బోర్డు సభ్యుడిగానూ ఆయన ఉన్నారు. ఆయన మృతి పట్ల పారిశ్రామిక వేత్తలతో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.