NTV Telugu Site icon

Job Application Reject: ఏం కర్మరా బాబు.. ఉద్యోగం కోసం అప్లై చేసిన నిమిషానికే రిజెక్ట్

Job

Job

Job Application Reject: ఉద్యోగ అన్వేషణలో కొన్ని అప్లికేషన్ల సమీక్షకు వారాలు పట్టవచ్చు. మరికొన్ని కొద్ది రోజులకే సమాధానం రావొచ్చు. అయితే, ఓ అభ్యర్థి ఉద్యోగానికి అప్లై చేసిన కేవలం ఒక నిమిషం లోపే రిజెక్ట్ అయినట్లు తెలియడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్‌లో ఈ విషయాన్ని పంచుకున్న అతను, “ఒక నిమిషంలో ఎంతో మారిపోవచ్చు. నేను నా అర్హత, అనుభవం, లొకేషన్, అమెరికాలో పని చేయడం ఇలా అన్నింటినీ క్రాస్ చెక్ చేసుకున్నాను. అయినా ఒక్క నిమిషంలోనే నా అప్లికేషన్‌ను తిరస్కరించారు. వారి రిజెక్షన్ మెయిల్‌లో ‘పదవిని ఇప్పటికే భర్తీ చేసాం’ అని ఉందని.. అయితే, ఆ ఉద్యోగం ఖాళీ లేకపోతే అప్లికేషన్‌ను ఎందుకు స్వీకరించారు?” అని ప్రశ్నించాడు.

Read Also: Posani Krishna Murali Case: పోసాని బెయిల్‌ పిటిషన్‌.. అప్పటి వరకు ఆగాల్సిందే..!

ఈ సంఘటనను ఎదురుకున్న అభ్యర్థి తన మెయిల్ ఇన్‌బాక్స్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అందులో 11:54 AMకు అతని అప్లికేషన్ స్వీకరించబడినట్లు మెయిల్ వచ్చింది. కేవలం ఒక నిమిషం తరువాత, 11:55 AMకు మరో మెయిల్ అందింది, అందులో ” మీరు అప్లై చేసిన పదవి భర్తీ చేయబడింది. కాబట్టి, మీ అప్లికేషన్‌ను ప్రస్తుతానికి పరిశీలించలేం. భవిష్యత్తులో ఖాళీ వస్తే మీ రిజ్యూమ్‌ను పరిశీలిస్తాం. మీ కెరీర్ అన్వేషణకు శుభాకాంక్షలు!” అని రాసి ఉందని తెలిపాడు.

A lot can happen UNDER A MINUTE. Yes, one minute.
byu/Delicious-Demand-495 inrecruitinghell

ఈ సంఘటనను చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఈ పోస్ట్ పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో ఒకరు ఇలాంటి కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలిని కొందరు కామెంట్ చేస్తుండగా.. ఇంకొంతమంది రిజెక్ట్ చేయడానికి అంత ఆత్రంగా ఉందేమో అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరేమో మాకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని కామెంట్ చేస్తున్నారు.