JIO Offers: రిలయన్స్ జియో మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. కంపెనీ అధికారికంగా చేసిన ప్రకటనలో భాగంగా.. ‘జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్’ ప్లాన్లపై ప్రత్యేక బెనిఫిట్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం 3 నెలల ప్లాన్ రీచార్జ్ చేస్తే అదనంగా 1 నెల ఉచిత వాలిడిటీ లభిస్తుంది. అంటే 3 నెలల ధరకే ఇప్పుడు 4 నెలల సేవలను పొందవచ్చు. జియో హోమ్ అనేది జియో అందించే బ్రాడ్‌బ్యాండ్ సేవ. ఇందులో కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ టీవీ, OTT యాప్స్ వంటి సర్వీసులు ఒకే ప్లాన్‌లో అందుబాటులో ఉంటాయి. ఒకే ప్యాక్ లో పూర్తి డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం ఈ సేవ ప్రత్యేకత.
రూ. 555 ప్లాన్ వివరాలు:
ఎంట్రీ లెవల్ ప్లాన్ గా నెలకు రూ. 555 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో వినియోగదారులు
స్పీడ్: 30 Mbps
డేటా: ప్రతి నెల 1000GB
అదనపు బెనిఫిట్స్: 800+ లైవ్ టీవీ ఛానల్స్, 10–12 OTT యాప్స్
ఆఫర్‌తో మొత్తం వాలిడిటీ: 4 నెలలు పొందవచ్చు.
రూ. 833 ప్లాన్ వివరాలు:
ఈ ప్లాన్ మెరుగైన స్పీడ్ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ లో వినియోగదారులకు
స్పీడ్: 100 Mbps
డేటా: ప్రతి నెల సుమారు 1000GB
అదనపు బెనిఫిట్స్: కాలింగ్, OTT యాప్స్
ఆఫర్‌తో 1 నెల అదనంగా లభిస్తుంది.
CM Revanth Reddy : వైద్య రంగానికి కొత్త ఊపిరి.. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు..!
రూ.1111 ప్లాన్ వివరాలు:
కాస్త ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది. ఇందులో వినియోగదారులకు
స్పీడ్: 100 Mbps
డేటా: ప్రతి నెల 1000GB
OTT బెనిఫిట్స్: 16 యాప్స్ వరకు
నెలవారీ ధర:1199
అదనంగా 1 నెల ఉచితం అందుకుంటారు.
More matches. More movies. More streaming. 🔥
Get 1 month FREE with every 3-month JioHome recharge!
Link: https://t.co/9NVfeVwLv1#JioHomeJioMore #GoogleGeminiPro #Jio pic.twitter.com/yj05GmCTFO
— Reliance Jio (@reliancejio) March 24, 2026
