Site icon NTV Telugu

JEE Advanced 2025 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Results

Results

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT కాన్పూర్) నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు హాజరైన విద్యార్థుల ఫలితాలు ఈరోజు అంటే జూన్ 2, 2025న విడుదలయ్యాయి. ఫలితాలు IIT కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. విద్యార్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు, ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. JEE అడ్వాన్స్‌డ్ ఆదివారం, మే 18, 2025న నిర్వహించారు.

Also Read:Uppal: అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు.. బుద్ధి చెప్పిన పోలీసులు

JEE అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్‌కు అర్హులు అవుతారు. 23 IITలు, 32 NITలు, 26 IIITలు మరియు 38 ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక సంస్థలకు (GFTIలు) సీట్ల కేటాయింపు ప్రక్రియను JoSAA నిర్వహిస్తుంది. ఆర్కిటెక్చర్‌ను అభ్యసించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2025 కోసం రిజిస్ట్రేషన్ జూన్ 2 నుంచి జూన్ 3 వరకు ఉంటుంది. AAT 2025 పరీక్ష జూన్ 5న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. ఫలితాలు జూన్ 8న విడుదలయ్యే అవకాశం ఉంది.

స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inని సందర్శించండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో JEE (అడ్వాన్స్‌డ్) 2025 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు లాగిన్ ఆధారాలను నమోదు చేసి సమర్పించాలి.
దీని తర్వాత మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై తెరుచుకుంటుంది. ఇక్కడ ఫలితాలను చూసుకోని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Exit mobile version